KDP: కడపలోని వీధుల్లో పాత సామాన్లు సేకరించే వారికోసం కేంద్రం నమస్తే ప్రోగ్రాం అమలు చేస్తున్నట్లు ప్రొద్దుటూరు మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ కొండయ్య తెలిపారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో మెప్మా, శానిటేషన్ సిబ్బందితో నమస్తే ప్రోగ్రాం అమలుపై ఆయన సమావేశం నిర్వహించారు. ఎలాంటి గుర్తింపుకు నోచుకోని అటువంటి వారిని సర్వేచేసి వారి వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు.