MDCL: డిసెంబర్ 8, 9 తేదీలలో మీరాఖాన్ పేట పరిధిలో జరుగనున్న తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నామని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఇతర ఉన్నతాధికారులతో కలిసి సమ్మిట్ వేదిక, పార్కింగ్ స్థలం, హెలిపాడ్ ప్రదేశాల రోడ్ మ్యాప్‌ను దగ్గరుండి పరిశీలించారు. ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ బందోబస్తుపై అధికారులకు సీపీ పలు కీలక సూచనలు చేశారు.