హన్మకొండ జిల్లా కాజీపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం కుల వివక్ష పోరాట సమితి సభ్యులు ఆందోళన నిర్వహించారు. పరువు హత్యలను నిరసిస్తూ ధర్నా చేశారు. పరువు హత్యలకు పాల్పడుతున్న వ్యక్తులను కఠినంగా శిక్షించాలని ఆయా కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ తహసిల్దార్‌కు వినతి పత్రం సమర్పించారు. జిల్లా అధ్యక్షుడు ఓరుగంటి సాంబయ్య పాల్గొన్నారు.