SRD: చలికాలంలో ఉదయం సమయంలో వాహనాలు నడిపేవారు జాగ్రత్తలు పాటించాలని కొండాపూర్ ఎస్సై సోమేశ్వరి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం, రాత్రి సమయంలో పొగ మంచు ఉండటం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెప్పారు. వాహనాలను నిదానంగా నడిపించాలని సూచించారు. వైపర్, లైట్లు, బ్రేకులు సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలని తెలిపారు.