TG: తన చివరి రక్తం బొట్టు ఉన్నంత వరకు బీసీ జాతి కోసం పోరాటం చేస్తానని బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య అన్నారు. బీసీల భవిష్యత్ కార్యాచరణ కార్యక్రమంలో మాట్లాడిన కృష్ణయ్య.. పదవులు, ప్రయోజనాల కోసం ఏ రాజకీయ నాయకుడికి లొంగకుండా బీసీల కోసం ఉద్యమం చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమం లాగా.. బీసీ ఉద్యమం మారాలని ఆకాంక్షించారు.