MLG: తమకు 3 నెలల నుంచి జీతాలు చెల్లించడం లేదని ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి ఎన్హెచ్ఎం స్కీం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే తమకు రావాల్సిన 3 నెలల జీతాలు, పీఆర్సీ చెల్లించాలని డిమాండ్ చేశారు. తమను వెంటనే రెగ్యులర్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభుదాసు, గణేశ్, శ్వేత పాల్గొన్నారు.