KDP: ఖాజీపేట మండల అభివృద్ధి కార్యాలయంలో స్థానిక సీఐ వంశీధర్ సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనలు, చైన్ స్నాచింగ్, మహిళలపై జరుగుతున్న నేరాల గురించి అవగాహన నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు, హరిత రాయబారులు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. సీఐ మాట్లాడుతూ.. సైబర్ నేరాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.