పల్నాడు జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ వర్గాల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు రేపు (శనివారం) ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా వెల్లడించారు. ఉదయం 10.30 గంటలకు కలెక్టరేట్ కార్యాలయంలో ఈ ప్రత్యేక వేదిక జరగనుందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ సమాజానికి చెందిన ప్రజలు తమ సమస్యలు తెలపవచ్చన్నారు.