AP: టిడ్కో, గృహనిర్మాణాలపై CM చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మూడేళ్లలో 17 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యం. 3 నెలలకోసారి సామూహిక గృహప్రవేశాలు. వచ్చే ఉగాదికి 5 లక్షల మందికి ఇళ్లు పంపిణీ. ఇళ్ల లబ్ధిదారుల సర్వే త్వరితరగతిన పూర్తి చేయాలి. నిలిచిన NTR హౌసింగ్ బిల్లులు వచ్చేలా.. కేంద్రంలో సంప్రదింపులు జరపాలి’ అని సూచించారు.