WNP: స్కూల్ బస్సులను డ్రైవర్లు జాగ్రత్తగా నడపాలని రూరల్ ఎస్సై జలంధర్ రెడ్డి అన్నారు. ఈరోజు పలు స్కూల్ బస్సులను ట్రాఫిక్ ఎస్సై సురేంద్రతో కలిసి ఆయన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్కూల్ బస్సులు, విద్యార్థులను పాఠశాలలకు తరలించే ఆటోలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. భద్రత పాటించని డ్రైవర్లపై కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు.