కోనసీమ: రాష్ట్ర స్థాయి కబడ్డి పోటీలకు కొత్తపేట మండలం గంటి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వతరగతి చదువుతున్న విద్యార్థి ఆర్.సత్య సాయి ప్రవీణ్ ఎంపికైనట్లు హెచ్ఎం అక్కిరెడ్డి వెంకటేశ్వరరావు శనివారం తెలిపారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో జరిగిన ఎంపికలో ప్రవీణ్ రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొనేందుకు అర్హత సాధించాడు.