CTR: జీడి నెల్లూరు మండలంలో పదిమందికి సీఎం సహాయ నిధి మంజూరైనట్లు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ తెలిపారు. లబ్ధిదారులకు వాటిని శుక్రవారం ఆయన పంపిణీ చేశారు. మొత్తం రూ.7.40 లక్షల విలువచేసే చెక్కులను పెనుమూరులో లబ్ధిదారులకు అందించారు. పేదల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి ఆరోగ్యానికి మెరుగైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.