MDK: తెలంగాణ ఆదర్శ పాఠశాలలో మెదక్ నియోజకవర్గ ఇంఛార్జ్ కంఠారెడ్డి తిరుపతిరెడ్డి శుక్రవారం నీటి శుద్ధి కేంద్రాన్ని ప్రారంభించారు. విద్యార్థులకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు తన సోంత నిధులు సుమారు రూ.లక్షతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, మాజీ మున్సిపల్ ఛైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు.