KRNL: కూటమి ప్రభుత్వం వైద్య విద్యను నిర్వీర్యం చేస్తోందని ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి అన్నారు. వైద్య విద్య ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శుక్రవారం హోలగుంద మండలం కొత్తపేట తండా, నెరణికి, ఎల్లార్తి గ్రామాలలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాదిన్నర గడిచినా రాష్ట్రంలో అభివృద్ధి ఏమాత్రం జరగలేదని విమర్శించారు.