RR: ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా షాద్నగర్ తాలూకా ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పండుగల సాయన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జెండాను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రతి నియోజకవర్గంలో ముదిరాజులు చైతన్యం కావాలని, విద్యా, ఉద్యోగ, ఆర్థిక, సామాజికంగా మన హక్కులను మనం సాధించుకోవాలన్నారు.