మంచిర్యాల జిల్లా గుడిపేట వద్ద గల ప్రభుత్వ మెడికల్ కాలేజ్ నిర్మాణ పనులను పెద్దపల్లి MP గడ్డం వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్‌తో కలిసి శుక్రవారం పరిశీలించారు. కళాశాల తరగతి గదులు, హాస్టల్ బ్లాకులు, ప్రయోగశాలలు, ఆసుపత్రి విభాగాల్లో జరుగుతున్న పనులను సమీక్షించారు. కళాశాల పనులను వేగవంతం చేసి సమయానికి ప్రజల కోసం అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.