విజయనగరం జిల్లాలో మాతృ, శిశు మరణాలు సంభవించడం పట్ల వైద్యారోగ్యశాఖపై కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరణాలు చోటు చేసుకుంటుంటే క్షేత్రస్థాయిలోని ప్రభుత్వ యంత్రాంగం ఏంచేస్తుందని ప్రశ్నించారు. పేద ప్రజల ప్రాణాల రక్షణ కోసమే ఈ యంత్రాంగం ఉందని, సిబ్బంది నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు.