KNR: మహిళలు తమ ఆరోగ్యం పిల్లల పోషణ పట్ల అవగాహన పెంచుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్ రూరల్ మండలం గోపాల్ పూర్ అంగన్వాడి కేంద్రంలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సభ జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. శుక్రవారం సభల ద్వారా గ్రామస్థాయిలో ప్రతి మహిళపోషణ, ఆరోగ్యంపై అవగాహన ఉండాలన్నారు.