MNCL: విద్యార్థులు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలని సేవా భారతి సభ్యులు రఘునాథ్ వెరబెల్లి కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నపేద విద్యార్థులకు కంప్యూటర్ విద్య ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలనే ఉద్దేశంతో శుక్రవారం లక్షెట్టిపేట పట్టణ ప్రభుత్వ బాలురు, జెండా వెంకటాపూర్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, హాజీపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు ఐదు ల్యాప్ట్యాప్లు, 43 LED స్క్రీన్లు, ఇంటర్నెట్ కనెక్షన్లను ఆయన అందజేశారు.