NZB: జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డుల గడువు తీరిపోయి ఏడాదిన్నర గడిచిందని, వాటి స్థానంలో కొత్తవి ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ ప్రతినిధులు కోరారు. టీడబ్ల్యూజేఎఫ్ అడ్ హక్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధులు రాంచందర్, భాస్కర్, వెంకటేష్, మధు, అనిత ఉన్నారు.