ఉత్కంఠ భరితంగా సాగిన రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ సెమీఫైనల్-1 మ్యాచ్ సూపర్ ఓవర్‌కు వెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన భారత్ కూడా 6 వికెట్లకు 194 పరుగులు చేసింది. మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్లో ఫలితం తేలనుంది.