NDL: అవయవ దానం ప్రాణాలకు ప్రాణం ఇచ్చే మహోన్నత సేవ అని, అవయవ దానంకు దాతలు ముందుకు రావాలని నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పిలుపు నిచ్చారు. శుక్రవారం న్యూఢిల్లీలో పార్లమెంటు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా అవయవ దానం – ప్రాణాలకు ప్రాణం ఇచ్చే మహోన్నత సేవ ఆంటూ ప్రచారం, అవగాహన కార్యక్రమాలు చేద్దాం అని పేర్కొన్నారు.