విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ దక్షిణాఫ్రికాకు చేరుకున్నారు. ఈ నెల 22, 23వ తేదీల్లో దక్షిణాప్రికా వేదికగా జీ-20 సదస్సు జరగనుంది. ఈ సదస్సులోని 3 సెషన్లలో ప్రధాని ప్రసంగిస్తారు. సమగ్ర, స్థిరమైన ఆర్థిక వృద్ధి, వాణిజ్యం, వాతావరణ మార్పులు, అరుదైన ఖనిజాలు, AI అంశాలపై మాట్లాడతారు. అలాగే వివిధ దేశాధినేతలతోనూ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు.