ప్రకాశం: కనిగిరి మండలం చీర్లదిన్నె టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు అట్ల మల్లికార్జున్ రెడ్డి నిన్న గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. శుక్రవారం మల్లికార్జున్ రెడ్డి అంత్యక్రియలు గ్రామంలో నిర్వహించగా ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అంత్యక్రియలకు హాజరై, స్వయంగా మల్లికార్జున్రెడ్డి పార్థివ దేహం ఉంచిన పాడే మోసి నివాళులు అర్పించారు.