WNP: ప్రజాపాలనలో ప్రభుత్వం మహిళలకు సముచితస్థానం కల్పిస్తుందని ఎమ్మెల్యే మెఘారెడ్డి అన్నారు. పెద్దమంద్దడిలో మహిళలకు కలెక్టర్ ఆదర్శ సురభితో కలిసి ఎమ్మెల్యే చీరలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని మహిళలకు సారే ఇవ్వాలనే ఉద్దేశంతో కోటి మంది మహిళలకు సీఎం చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు.