ప్రకాశం: కనిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం తల్లిదండ్రులు, అధ్యాపకుల సమావేశం జరిగింది. కళాశాల అభివృద్ధికి తల్లిదండ్రుల నుంచి ప్రిన్సిపల్ ఉషారాణి సూచనలు స్వీకరించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి BSc హానర్స్లో జువాలజీ కోర్సు ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. కొత్త కోర్సుల నిర్వహణకు భవన నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని ప్రిన్సిపల్ పేర్కొన్నారు.