MLG: ఏటూరునాగారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ (PACS) ఛైర్మన్గా కూనూరు అశోక్ గౌడ్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు ఈరోజు ఉదయం PACS కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా స్థానిక అధికారులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మండలంలో రైతు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చైర్మన్ తెలిపారు.