SRCL: శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ మహేష్ బీ గీతే అన్నారు. తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను ఎస్పీ మహేష్ బి గీతే తనిఖీ చేశారు. స్టేషన్లోని రికార్డులను పరిశీలించారు. స్టేషన్ పరిధిలోని పెండింగ్ కేసులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు.