ADB: పిల్లల హక్కుల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని రాష్ట్ర చైల్డ్ కమిషన్ ఛైర్పర్సన్ సీత దయాకర్ రెడ్డి సూచించారు. శుక్రవారం పట్టణంలో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల బాలల భద్రత, బాల్య వివాహాల నియంత్రణ, పోక్సో చట్టం అమలు, చైల్డ్ ప్రొటెక్షన్ వ్యవస్థపై కలెక్టర్ రాజర్షి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు వందన గౌడ్, అపర్ణ, సరిత, తదితరులున్నారు.