MNCL: నెన్నెల మండలం ఖర్జీ గ్రామంలో బెల్లంపల్లి రూరల్ పోలీస్ ఆధ్వర్యంలో ప్రజలకు చలి నుంచి కాపాడుకోవడానికి 150 దుప్పట్లను వృద్ధులకు శుక్రవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో DCP భాస్కర్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. పేద ప్రజలకు దుప్పట్లు అందజేసిన NRI గుడిమల్ల మమతకు అభినందనలు తెలిపారు. ప్రజల భద్రత, రక్షణే పోలీసుల ప్రధాన ధ్యేయమని DCP పేర్కొన్నారు.