SRCL: నూతనంగా ఎన్నికైన పద్మశాలి సంఘం కార్యవర్గ సభ్యులు సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ కేకే. మహేందర్ రెడ్డిని హైదరాబాద్లోని తన ఆఫీస్లో ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కేకే. మహేందర్ రెడ్డిని శాలువాతో సన్మానించి, పూల బొకే అందజేశారు. ఈ కార్యక్రమంలో దూడం శంకర్, మండల సత్యం, డా. గాజుల బాలయ్య, మోర రవి, కోడం శ్రీనివాస్, యెల్లె శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.