ADB: ఇంద్రవెల్లి మండలం ఈశ్వర్ నగర్లో ఏఎస్పీ కాజల్ సింగ్ ఆధ్వర్యంలో శుక్రవారం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. సరైన పత్రాలు లేని 52 బైక్లు, 2 ఆటోలు సీజ్ చేశారు. ఏఎస్పీ మాట్లాడుతూ.. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దని, ప్రజలు గంజాయి, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని వివరించారు.