KDP: క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాల సభ్యులందరినీ త్వరలోనే పట్టుకుంటామని ప్రొద్దుటూరు DSP భావన శుక్రవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. వెబ్సైట్ ఆన్లైన్ లావాదేవీలు నడుపుతూ, బెట్టింగ్ భూతాన్ని విస్తరిస్తున్న వారందరిపై విచారణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వారందరిపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. అనుమానాస్పద బ్యాంక్ లావాదేవీలను పరిశీలిస్తున్నమని పేర్కొన్నారు.