KMR: దోమకొండలో జనవాసాల మధ్య కొనసాగుతున్న మద్యం దుకాణాలను తొలగించాలని గ్రామ ప్రజలు కోరారు. శుక్రవారం కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డికి వారు వినతి పత్రం సమర్పించారు. మద్యం దుకాణాల వల్ల మహిళలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అధికారులతో మాట్లాడి, దుకాణాలను గ్రామ చివరిలో ఏర్పాటు చేయించాలని వేడుకున్నారు.