SRD: జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్ ఇవాళ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలోని బీజేపీ నాయకులు శుక్రవారం హర్షం వ్యక్తం చేశారు. జిల్లా బీజేపీ కార్యదర్శి అరుణ్ రాజ్ శేరికార్, ఇతరత్రా నాయకులు ఇవాళ హైదరాబాద్‌లో బీబీ పాటిల్‌ను ఆయన నివాసంలో కలుసుకొని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.