KKD: అంబాజీపేట విద్యార్ది వాలీబాల్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. కాకినాడలో జరిగిన అండర్-14 వాలీబాల్ బాలుర పోటీలలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తరుపున ప్రాతినిధ్యం వహించినట్లు తెలిపారు. అంబాజీపేట సెయింట్ మేరీస్ పాఠశాలలో 8వ తరగతి విద్యార్ధి మల్లిపూడి మహిధర్ కృష్ణ రాష్ట్రస్థాయి జట్టుకు ఎంపికయ్యాడు. నెల్లూరులో జరగనున్న పోటీలలో పాల్గొననున్నాడు.