ELR: జంగారెడ్డిగూడెంలో గురుకుల పాఠశాల హాస్టల్లో టెన్త్ చదువుతున్న ఓ విద్యార్థిని శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడింది. లంచ్ టైంలో హాస్టల్ గదిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంది. వెంటనే ఉపాధ్యాయులు విద్యార్థినిని చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.