NGKL: వంగూర్ పోలీస్ స్టేషన్ను డీఎస్పీ వెంకట్ రెడ్డి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది ఆయనకు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం డీఎస్పీ మండలంలో శాంతి భద్రతల పరిస్థితిని సమీక్షించారు. పాత నేరస్తులపై నిరంతరం నిఘా ఉంచి, వారి కదలికలను పరిశీలించాలని పోలీసులకు ఆయన సూచించారు. అనంతరం స్టేషన్ ఆవరణలో ఆయన మొక్కలు నాటారు.