WGL: విద్యుత్ సమస్యలు ఫిర్యాదు చేసేందుకు TGNPDCL వాట్సాప్ నంబరును అందుబాటులోకి తీసుకొని వచ్చింది. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి విద్యుత్ శాఖ 79016 28348 అనే వాట్సాప్ నంబర్ వినియోగంలోకి తెచ్చింది. ఈ నంబరుకు ‘HI’ అని మెసేజ్ చేసి విద్యుత్ సేవలు పొందవచ్చని అధికారులు తెలిపారు.