ADB: దేవాలయాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని రాజ్ గోండ్ సేవ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విషంరావు కోరారు. ఆదిలాబాద్ జిల్లా పాలనాధికారి రాజర్షి షాను మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. గోండ్వానా దేవస్థానాల అభివృద్ధి కోసం జీవో విడుదల చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తానాజీ, జంగు పటేల్, నిరంజన్, శేషారావు పాల్గొన్నారు.