AP: భూముల రీసర్వేపై రైతుల అభ్యంతరాల పరిష్కారానికి తహసీల్దార్ స్థాయిలో ప్రస్తుతం ఏడాది గడువు ఉంది. దీన్ని రెండేళ్లకు పెంచేలా ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలిపారు. 16 వేల గ్రామాలకుగానూ ఇప్పటికి 6,688 గ్రామాల్లో రీసర్వే పూర్తయిందని చెప్పారు. రీసర్వేను 2027 డిసెంబర్లోగా పారదర్శకంగా పూర్తి చేస్తామని తెలిపారు.