ఉక్రెయిన్- రష్యా యుద్ధం ముగింపునకు 28 సూత్రాలతో శాంతి ప్రణాళికను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించారు. తాజాగా ఈ శాంతి ప్రణాళికను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వ్యతిరేకించారు. తమ దేశ ప్రయోజనాలకు భంగం కలగకుండా చూసుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ క్రమంలో అమెరికా స్నేహం కోల్పోయే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు.