KNR: విద్యార్థులకు చదువుతో పాటు బయట ప్రపంచంపై అవగాహన అవసరమని SBI సైదాపూర్ బ్యాంక్ మేనేజర్ రాకేష్ అన్నారు. సోమారం మోడల్ స్కూల్లో ఫైనాన్షియల్ లిటరసీపై శుక్రవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. డబ్బును ఎలా పొదుపు చేయాలి, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు, ఆదాయ పన్ను జీఎస్టీలపై విద్యార్థులకు విలువైన సూచనలిచ్చారు.