AP: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీలో 2025-26 విద్యా సంవత్సరానికి BSC (హానర్స్) వ్యవసాయం, బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ) కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 24 నుంచి 30 వరకు చివరి విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ ఎం.వి.రమణ వెల్లడించారు. పూర్తి వివరాలకు angrau.ac.in వెబ్సైట్లో చూడొచ్చని తెలిపారు.