హన్మకొండలోని జెఎన్ఎస్ స్టేడియంలో గత 10 రోజులుగా నిర్వహించిన ఆర్మీ రిక్రూట్మెంటు ర్యాలీ శుక్రవారంతో విజయవంతంగా ముగిసింది. దీంతో ఆర్మీ అధికారులు శుక్రవారం సాయంత్రం కలెక్టర్ స్నేహ శబరీష్ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో కల్నల్ సునీల్ యాధవ్, మేజర్ ప్రకాష్ చంద్ర రాయ్, తదితరులు పాల్గొన్నారు.