ఆధునిక జీవనశైలిలో నడక తప్పనిసరి. అయితే శీతాకాలంలో చల్లని గాలిలో నడవడం సురక్షితమేనా? అనే ప్రశ్న చాలా మందికి వచ్చే ఉంటుంది. ఆస్తమా, బీపీ, గుండె జబ్బులు ఉన్నవారు చల్లని గాలిలో మరింత జాగ్రత్తగా ఉండాలి. వెచ్చని దుస్తులు ధరించాలి. నడకను నెమ్మదిగా మొదలుపెట్టాలి. శరీరం చల్లబడకుండా చేతులు, కాళ్లు కప్పి ఉంచాలి. గొంతు/ఊపిరితిత్తుల రక్షణకు నీరు తాగుతూ, అవసరమైతే మాస్క్ ధరించాలి.