AKP: బంగారం పుస్తెలతాడు దొంగతనం చేసిన కేసులో నిందితుడు జీ. అప్పారావును శుక్రవారం అరెస్టు చేసినట్లు సీఐ మల్లికార్జునరావు తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు 16 రాత్రి స్థానిక రైల్వే వంతెన వద్ద జీ. అప్పారావు, ఎం. శ్రీను కలిసి ఈరోతి కన్నమ్మ మెడలో రెండున్నర తులాలు బంగారు పుస్తెలతాడు తెంచుకుని పారిపోయినట్లు తెలిపారు.