భారత ప్రధాని మోదీ జీ20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికా చేరుకున్నారు. ఇవాళ, రేపు దక్షిణాఫ్రికాలో ఈ జీ20 శిఖరాగ్ర సదస్సు జరగనుంది. ప్రపంచ ఆర్థిక, సామాజిక అంశాలపై సభ్య దేశాల అధినేతలు ఈ సమావేశంలో చర్చించనున్నారు. భారత్ తరపున ప్రధాని మోదీ ఈ సదస్సులో కీలక ప్రసంగాలు చేస్తారు. ప్రపంచ దేశాల మధ్య సహకారం, కీలక నిర్ణయాలకు ఈ సదస్సు వేదిక కానుంది.