TG: iBOMMA రవిని ఇవాళ పోలీసులు మూడో రోజు విచారించనున్నారు. రెండు రోజులుగా రవి విచారణలో సహకరించలేదని పోలీసులు వెల్లడించారు. కాగా సినిమాలను పైరసీ చేసి iBOMMA వెబ్సైట్లో పెడుతున్నాడనే ఆరోపణలతో అతన్ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నాంపల్లి కోర్టు రవిని ఐదు రోజుల పాటు పోలీసు కస్టడీకి అనుమతి ఇచ్చింది.