E.G: సివిల్స్ ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు అర్హత పొందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు విజయవాడలో ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు రాజమండ్రి బీసీ స్టడీ సర్కిల్ సంచాలకులు బి. శశాంక తెలిపారు. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 25లోగా స్టడీ సర్కిల్ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. డిసెంబర్ 5న స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.